అదుపు తప్పిన స్కూల్‌ బస్సు.. ముగ్గురికి గాయాలు
నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వశిష్ఠ స్కూల్ బస్‌ ప్రమాదానికి గురయింది. చిట్టవరం గ్రామం నుంచి నరసాపురం వెళ్తుండగా.. బస్సు అదుపు తప్పి పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకుపోయింది. ఈ సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు. లోపల ఉన్న విద్యార్థులను స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు. ముగ్గురు చిన్నారులకు స్వల్ప గాయాలు కావడంతో వారిని దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బస్సు స్టీరింగ్ వదిలేయడంతో వాహనం అదుపు తప్పిందని డ్రైవర్ చెప్పాడు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇరుకు రోడ్లలో కండీషన్ లేని బస్సులు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు.

RELATED STORIES