కారు బస్సు కాదు.. రైలు లీజుకు తీసుకొని నడపండి

కారు లేదంటే బస్సు లీజుకు తీసుకొని నడుపుకోవడం చూసి ఉంటాం. కానీ రైలు లీజుకు తీసుకోవడం ఎంటని ఆలోచిస్తున్నారా? మీకు చదివింది నిజమే. రైలు లీజుకు తీసుకొని నడుపుకునే రోజులు రానున్నాయి. 
కేంద్ర ప్రభుత్వం ప్యాసింజర్ ట్రైన్స్ విభాగంలోకి ప్రైవేట్ ఆపరేటర్లను తీసుకురావాలని భావిస్తోంది. రద్దీ తక్కువగా ఉన్న, టూరిస్ట్ మార్గాల్లో ట్రైన్లను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించాలని యోచిస్తోంది. వచ్చే 100 రోజుల్లో దీనికి సంబంధించి బిడ్లను ఆహ్వానించే అవకాశముంది. 

కేంద్ర ప్రభుత్వం ట్రైన్ల ప్రైవేటీకరణను ప్రయోగాత్మకంగా పరీక్షించాలని చూస్తోంది. ఇండియన్ రైల్వేస్ ఇందులో భాగంగా ఐఆర్‌సీటీసీకి రెండు రైళ్లను అప్పగించనుంది. టికెటింగ్, బోర్డింగ్ సర్వీసులను ఐఆర్‌సీటీసీనే అందిస్తుంది. ఈ ట్రైన్లను ఏ ఏ రూట్లలో నడపాలో ఇండియన్ రైల్వేస్ నిర్ణయిస్తుంది. ట్రైన్లు తీసుకున్నందుకు గానూ ఐఆర్‌సీటీసీ వార్షిక లీజు చార్జీలను రైల్వే ఫైనాన్షింగ్ విభాగమైన ఐఆర్ఎఫ్‌సీకి అందిస్తుంది. 

RELATED STORIES